స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి హెచ్చరించారు. పోలింగ్ విధులకు సంబంధించి నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరైన పోలింగ్ అధికారులు (పీవోలు), సహాయ పోలింగ్ అధికారులపై (ఏపీవోలు) చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ విధులకు సంబంధించి గురువారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి గైర్హాజరైన పోలింగ్ అధికారులు (పీవోలు), సహాయ పోలింగ్ అధికారులు (ఏపీవోలు)పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎన్నికలు అత్యంత పవిత్రమైన ప్రక్రియ అని, ఇందులో విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎన్నికల విధులకు నియమితులైన అధికారులు శిక్షణా కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. శిక్షణకు హాజరు కాకపోవడం అంటే ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే అవుతుందని, అటువంటి వారిపై ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.











