మణుగూరు ప్రాంతంలో సింగరేణి బొగ్గు దుమ్ముతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, తక్షణమే నివారణ చర్యలు చేపట్టాలని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజా పంథా) డిమాండ్ చేసింది. ఈ దుమ్ము వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని పార్టీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.
మణుగూరు డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, మణుగూరు - ఏటూరు నాగారం ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకల వల్ల విపరీతమైన బొగ్గు దుమ్ము లేస్తోందని తెలిపారు. రైల్వే బ్రిడ్జి దగ్గర కనకదుర్గమ్మ గుడి నుండి మల్లెపల్లి ఓసి కి వెళ్లే మూలమలుపు వరకు ఈ దుమ్ము ప్రజల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తోందని అన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ దుమ్మును పీల్చడం వల్ల ప్రజలు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు ఇతర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.












