మండల కేంద్రంలో ప్లాస్టిక్ రహిత కార్యక్రమాల్లో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఈ బ్యాంక్ ద్వారా 3000 స్టీల్ ప్లేట్లు, 1000 స్టీల్ గ్లాసులను అందుబాటులోకి తెచ్చారు. వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలకు వీటిని ఉచితంగా అందిస్తున్నారు.
మండల కేంద్రమైన మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో ప్లాస్టిక్ రహిత కార్యక్రమంలో భాగంగా ఈ స్టీల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 3000 స్టీల్ ప్లేట్లు, 1000 స్టీల్ గ్లాసులు ఉన్నాయి. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణకు గ్రామ పంచాయతీ కృషి చేస్తోంది. గ్రామ పంచాయతీ స్టీల్ బ్యాంక్ ద్వారా వినాయక చవితి సందర్భంగా ఇప్పటివరకు 42 యూత్, సంఘాల వారు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాలకు ఉచితంగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు అందించారు. భవిష్యత్తులో గ్రామంలో జరిగే ఇలాంటి కార్యక్రమాలకూ గ్రామ పంచాయతీ స్టీల్ బ్యాంక్ నుండే ఈ సేవలు అందించబడతాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల రాజేష్, వార్డు సభ్యులు పిట్ల దయాకర్, తెడ్డు సందీప్, ఫాజిల్, అతిక్ మరియు పలు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ స్టీల్ బ్యాంక్ ఏర్పాటుతో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











