కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో గల స్వప్నలోక్ కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
ఆలయ పూజారి శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు ప్రసాదాలను సమర్పించి, సాంస్కృతిక నృత్యాలు, భక్తి గీతాలు ఆలపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతి వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ పూజలలో పాల్గొన్న వారికి అష్ట ఆయురారోగ్యాలతో పాటు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో నవరాత్రులను జరుపుకొని సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయకుని దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఆదివారం నాడు కుంకుమ పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత గంజి వెంకటేశం, స్వప్నలోక్ కాలనీ కార్యవర్గం, కాలనీవాసులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











