కుప్పం, జులై 04
కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నలగంపల్లిలో అమలు చేస్తున్న నెట్ జీరో విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. సోలార్ రూఫ్‌టాప్, వన నీటి సంరక్షణ వంటి పద్ధతులను ఆయన సమీక్షించారు. ఈ విధానాన్ని నియోజకవర్గం అంతటా విస్తరించాలని అధికారులను ఆదేశించారు.
కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, నలగంపల్లిలోని నెట్ జీరో విధానాన్ని అమలు చేస్తున్న ఇళ్లను సందర్శించారు. సోలార్ రూఫ్‌టాప్, సోలార్ ఇండక్షన్ కుక్‌టాప్‌లు, వన నీటి సంరక్షణ, కిచెన్ కంపోస్టింగ్, టెర్రస్ గార్డెనింగ్ వంటి పద్ధతులను ఆయన పరిశీలించారు.
నలగంపల్లి నమూనాను ఒక కేస్ స్టడీగా పరిగణించి, కుప్పం నియోజకవర్గం అంతటా నెట్ జీరో విధానాన్ని విస్తరించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
కుప్పంలో రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ విస్తరణ ద్వారా 7,489 మంది ఎస్సీ, ఎస్టీలకు, 39,215 మంది బీసీలకు, 7,381 మంది ఓసీ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.












