అన్నమయ్య, జూన్ 28
తంబళ్లపల్లె మల్లయ్య కొండ పరిరక్షణకు, మైనింగ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వైసిపి పార్టీ నాయకులు సోమవారం (జూన్ 29) భారీ గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సోదరుడు కలిచర్ల సుధాకర్ రెడ్డి పాల్గొంటారు. ఉదయం 6 గంటలకు ఆలయంలో అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక వారసత్వ సంరక్షణ లక్ష్యంగా తంబళ్లపల్లె మల్లయ్య కొండ పరిరక్షణకు వైసిపి పార్టీ నాయకులు సోమవారం భారీ గిరి ప్రదక్షిణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని వైయస్సార్ సిపి నాయకులు కలిచెర్ల సుధాహర్ రెడ్డి తెలిపారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని పవిత్ర మల్లయ్య కొండ ప్రాంతంలో మైనింగ్ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సోమవారం (జూన్ 29) ఈ గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటలకు మల్లయ్య కొండ ఆలయంలో అభిషేకంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కలిచర్ల ప్రభాకర్ రెడ్డి సోదరుడు కలిచర్ల సుధాకర్ రెడ్డి పాల్గొంటారు. అనంతరం కొండ దిగువన అల్పాహారం ఏర్పాటు చేశారు.












