కామారెడ్డి, జూలై 24
కామారెడ్డి పట్టణంలోని రామమందిర్ ఏరియా బడాయిగల్లీ సబ్సెంటర్లో వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ కామారెడ్డి పట్టణంలోని యూఎఫ్‌డబ్ల్యూసీ (UFWC) కామారెడ్డి పరిధిలోని రామమందిర్ ఏరియా బడాయిగల్లీ సబ్‌సెంటర్ వద్ద ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ప్రజలకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా. చందనప్రియ, మల్టీ పర్పస్ హెల్త్ సూపర్వైజర్ కె. శ్యామల, ఏఎన్ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు ఆరోగ్య సూచనలు అందించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం, దోమల నివారణకు అవసరమైన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజలు ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని వైద్య సిబ్బంది కోరారు.












