చైనాకు ప్రయాణించే అమెరికా పౌరులకు ఎదురయ్యే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని ఆ దేశానికి జారీ చేసిన ప్రయాణ హెచ్చరిక స్థాయిని పెంచాలని అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు యంగ్ కిమ్ కోరారు. చైనాలో అమెరికా పౌరులను అన్యాయంగా నిర్బంధించే ఘటనలు కొనసాగుతున్నాయని పేర్కొంటూ, ప్రస్తుత హెచ్చరికను రెండో స్థాయి నుంచి మూడో స్థాయికి పెంచాలని విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఆమె విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం అమెరికా విదేశాంగ శాఖ చైనాకు సంబంధించి రెండో స్థాయి ప్రయాణ హెచ్చరికను కొనసాగిస్తోంది. అంటే.. అక్కడికి వెళ్లే అమెరికన్లు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది. దీనిని మూడో స్థాయికి పెంచి, చైనాకు ప్రయాణాన్ని పునఃపరిశీలించాలని అమెరికన్లకు సూచించాలని యంగ్ కిమ్ కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అన్యాయ నిర్బంధంపై ఆందోళన
చైనా ప్రభుత్వం అమెరికా పౌరులను నిర్బంధించి, వారిని ఒత్తిడి సాధనాలుగా ఉపయోగిస్తోందని యంగ్ కిమ్ ఆరోపించారు. చైనాకు వెళ్లాలని భావిస్తున్న అమెరికన్లకు అక్కడి ప్రమాదాలపై స్పష్టమైన సమాచారం అందించాలని ఆమె పేర్కొన్నారు.












