అమెరికా రాజకీయాల్లో కీషా లాన్స్ బాటమ్స్ చరిత్ర సృష్టించారు. జార్జియా రాష్ట్ర గవర్నర్‌గా డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఆమె ఎన్నికయ్యారు. దీంతో అమెరికా చరిత్రలో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, వ్యాపారవేత్త రిక్ జాక్సన్‌పై ఆమె విజయం సాధించారు. గతంలో అట్లాంటా నగర మేయర్‌గా 2018 నుంచి 2022 వరకు పనిచేసిన బాటమ్స్, మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. జార్జియాలో రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన రిపబ్లికన్ పాలనకు ఆమె విజయంతో ముగింపు పలికినట్లయింది. ఎన్నికల ప్రచారంలో వైద్య సేవలను విస్తరించడం, కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడం, ఓటు హక్కుల పరిరక్షణ వంటి అంశాలకు ఆమె ప్రాధాన్యత ఇచ్చారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











