కుటుంబంలో ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జీసీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ సేవారథం ద్వారా ఉచిత భోజన సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంత్యక్రియల సమయంలో ఇంటికి వచ్చే బంధుమిత్రులకు భోజన ఏర్పాట్లు చేయడం బాధిత కుటుంబాలకు అదనపు భారంగా మారకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సేవ అవసరమైన కుటుంబాలు జీసీఆర్ ట్రస్ట్‌కు సమాచారం అందిస్తే, అన్నపూర్ణ సేవారథం ద్వారా ఉచితంగా భోజనాన్ని వారి ఇంటి వద్దకే తీసుకువచ్చి అందించనున్నారు. ఆప్తులను కోల్పోయిన బాధలో ఉన్న కుటుంబాలకు కొంత ఊరట కల్పించడంతో పాటు, వారి ఇబ్బందులను తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సేవను అవసరమైన ప్రతి కుటుంబం వినియోగించుకోవచ్చని, వివరాల కోసం 9536000333 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సేవా కార్యక్రమం గురించి ఇతరులకు కూడా తెలియజేసి, అవసరమైన వారికి సమాచారం చేరవేయాలని కోరారు.












