ఇరాన్‌లోని మిగిలిన అణు స్థావరాలను కేవలం 10 నిమిషాల్లో ధ్వంసం చేయగలమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని కూడా ఆయన వెల్లడించారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో నివాసంలో హాలోవీన్ వేడుకల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ అణు కార్యక్రమాన్ని అమెరికా సైన్యం ఇప్పటికే తీవ్రంగా దెబ్బతీసిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇంకా ఒకటి లేదా రెండు అణు కేంద్రాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోవాల్సి ఉందని, వాటిని కూడా కేవలం పది నిమిషాల్లో ధ్వంసం చేయగలమని ఆయన చెప్పారు. ఇరాన్‌కు చెందిన కీలక భూగర్భ అణు కేంద్రంగా భావిస్తున్న పిక్‌యాక్స్ మౌంటైన్ ( ) గురించి కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే ప్రస్తుతానికి మరోసారి దాడులు చేయడానికి అమెరికా తొందరపడటం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఇరాన్ సైనిక సామర్థ్యాలపై ప్రభావం
ఇరాన్‌కు చెందిన నౌకాదళం, వైమానిక దళం, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ వ్యవస్థలు, సైనిక పరికరాల తయారీ సామర్థ్యాన్ని అమెరికా దెబ్బతీసిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణు సామర్థ్యాలను కూడా నిర్వీర్యం చేసినట్లు ఆయన ప్రకటించారు.












