ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలను తప్పించుకునేందుకు నౌకలకు నకిలీ రిజిస్ట్రేషన్లు, ధ్రువీకరణ పత్రాలు అందించారనే ఆరోపణలతో భారతీయ వ్యాపారవేత్త సునీల్ కుమార్ శర్మ, ఆయన భార్య జస్ప్రీత్ ప్రీతీ షాహిద్‌పై అమెరికా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. వీరితో సంబంధం ఉన్న తొమ్మిది భారతీయ సంస్థలను కూడా ఆంక్షల జాబితాలో చేర్చింది.
అమెరికా ట్రెజరీ శాఖ ఈ చర్యను ప్రకటించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఎకనామిక్ అవుట్కాస్ట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చమురు ఆదాయాన్ని అడ్డుకోవడం, ఆ దేశ ఆర్థిక కార్యకలాపాలపై ఒత్తిడి పెంచడం ఈ చర్యల ప్రధాన లక్ష్యమని అమెరికా తెలిపింది. అమెరికా ట్రెజరీ శాఖ ప్రకారం, చండీగఢ్ కేంద్రంగా పనిచేసిన సునీల్ శర్మ, ఆయన భార్య పలు దేశాల సముద్ర రిజిస్ట్రేషన్ అధికారులుగా నటిస్తూ వెబ్సైట్లు నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గయానా, ఎస్వాటిని, లావోస్ తదితర దేశాల పేర్లతో నౌకలకు రిజిస్ట్రేషన్, జెండా గుర్తింపులు, నావికుల శిక్షణ ధ్రువీకరణలు, నౌకల వర్గీకరణ సేవలు అందించినట్లు అమెరికా పేర్కొంది. ఈ సేవలను ఉపయోగించుకున్న కొన్ని నౌకలు ఇరాన్‌కు చెందిన పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేశాయని, వాటిలో ఇరాన్ సైన్యం లేదా దానికి అనుబంధ సంస్థల తరఫున పనిచేసిన నౌకలు కూడా ఉన్నాయని అమెరికా ఆరోపించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ కార్యకలాపాలు 2014 నుంచే ప్రారంభమైనట్లు ట్రెజరీ శాఖ పేర్కొంది. 2023లో సింగపూర్‌లో ఏర్పాటు చేసిన ఒక సంస్థ ద్వారా కూడా నౌకల రిజిస్ట్రేషన్ సేవలు కొనసాగించినట్లు ఆరోపించింది. ఈ వ్యవహారంలో సునీల్ శర్మ, జస్ప్రీత్ షాహిద్‌తో పాటు మరో ఇద్దరు భారతీయుల పేర్లను అమెరికా ప్రస్తావించింది. వారి వ్యాపార కార్యకలాపాలతో సంబంధం ఉన్న తొమ్మిది భారతీయ సంస్థలను కూడా ఆంక్షలకు గురిచేసింది. వాటిలో , , , , , , , తదితర సంస్థలు ఉన్నాయి. అదనంగా సింగపూర్‌లోని ఒక సంస్థను కూడా అమెరికా ఆంక్షల జాబితాలో చేర్చింది.












