అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌పై ఆధిపత్యం కోల్పోతే, డెమోక్రాట్లు ప్రవేశపెట్టే బిల్లులను తన వీటో అధికారంతో అడ్డుకుంటానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అవసరమైతే తనను తాను మిస్టర్ వీటోగా మార్చుకుంటానని ఆయన వ్యాఖ్యానించారు. న్యూయార్క్ పోస్ట్‌కు చెందిన పాడ్ ఫోర్స్ వన్ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌లో డెమోక్రాట్లకు మెజారిటీ వస్తే వారు అనేక బిల్లులను తన ఆమోదం కోసం పంపిస్తారని ట్రంప్ అన్నారు. వాటిని వరుసగా వీటో చేస్తానని, నెల లేదా రెండు నెలల పాటు ఇలా జరిగితే చివరకు చర్చలకు వచ్చి ఒప్పందం చేసుకుంటారని పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని ట్రంప్ తెలిపారు. అలా జరిగితే తరచూ వీటో అధికారాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉండదని అన్నారు. జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లోని 35 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.












