ఒమన్ తీరంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై గుర్తుతెలియని వైమానిక వస్తువు దాడి చేయడంతో ఒక భారతీయ నావికుడు మృతి చెందాడు. నౌకలో ఉన్న మొత్తం 14 మంది భారతీయ సిబ్బందిలో 13 మంది సురక్షితంగా బయటపడి ఒమన్ కోస్ట్‌గార్డ్ చేత రక్షించబడ్డారు. మృతుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహీమ్ అజీజ్‌గా గుర్తించారు.
ఈ విషయాన్ని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, 14 మంది భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న భారత జెండా కలిగిన ఎంఎస్వీ అల్ జుసుఫీ ( ) నౌక ఒమన్ తీరానికి సమీపంలో ఉండగా గుర్తుతెలియని వైమానిక వస్తువు తాకింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఘటనలో నౌకలోని ఒక సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుడిని గుజరాత్‌కు చెందిన గంధర్ నహీమ్ అజీజ్‌గా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. నౌకలోని మిగిలిన 13 మంది సిబ్బంది ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.











