అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైట్‌హౌస్ బృందంలో కీలక మార్పు ప్రకటించారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ స్థానంలో తన అత్యంత విశ్వసనీయ సలహాదారు స్టీఫెన్ మిల్లర్‌ను నియమించారు. నుంచి మిల్లర్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైన కొద్ది రోజులకే ఈ నిర్ణయం వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఎవరీ స్టీఫెన్ మిల్లర్
41 ఏళ్ల స్టీఫెన్ మిల్లర్ ట్రంప్ రాజకీయ ప్రస్థానంలో చాలాకాలంగా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రసంగ రచయితగా పనిచేసిన ఆయన, ట్రంప్ తొలి పదవీకాలంలోనూ కీలక విధాన రూపకర్తగా ఎదిగారు. రెండోసారి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.











