అగ్నిపథ్ పథకం కింద భారత సాయుధ దళాల్లో చేరిన యువతకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత రెగ్యులర్ సైనికులుగా ఎంపిక కాని అగ్నివీరుల్లో 75 శాతం మందికి మరో రెండేళ్ల పాటు సర్వీసు పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు వార్తలు వెలువడ్డాయి.
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, నాలుగేళ్ల సేవ అనంతరం వెంటనే విధుల నుంచి తప్పుకోవాల్సిన అగ్నివీరులకు మరికొంతకాలం సాయుధ దళాల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది. అయితే ఈ పొడిగింపు స్వచ్ఛంద అంగీకారం మరియు నిర్దేశిత ఎంపిక ప్రమాణాలకు లోబడి ఉంటుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రస్తుతం అగ్నిపథ్ పథకం ప్రకారం ఎంపికైన అభ్యర్థులు నాలుగేళ్ల పాటు సైన్యంలో సేవలందిస్తారు. ఈ కాలం పూర్తయిన తర్వాత అర్హత, పనితీరు ఆధారంగా గరిష్ఠంగా 25 శాతం మందిని రెగ్యులర్ కేడర్‌లోకి తీసుకునే విధానం అమలులో ఉంది.












