పోలీసులు ఒక వ్యక్తిని అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచి కాకుండా, వారిని స్వేచ్ఛను హరించి మొదటిసారిగా తమ అదుపులోకి తీసుకున్న సమయం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత () సెక్షన్ 56 ప్రకారం ఈ గడువును లెక్కించాలని ధర్మాసనం పేర్కొంది.
పోలీసులు ఒక వ్యక్తిని అధికారికంగా అరెస్టు నమోదు చేసిన సమయం నుంచి కాకుండా, వారిని స్వేచ్ఛను హరించి మొదటిసారిగా తమ అదుపులోకి తీసుకున్న సమయం నుంచే 24 గంటల గడువు ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు కీలక స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(2), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత () సెక్షన్ 56 ప్రకారం ఈ గడువును లెక్కించాలని పేర్కొంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
కొన్ని సందర్భాల్లో పోలీసులు విచారణ, సోదాలు, స్వాధీనం వంటి ప్రక్రియల పేరుతో ఒక వ్యక్తిని ముందుగానే అదుపులోకి తీసుకుని, అధికారిక అరెస్టును కొన్ని గంటల తర్వాత నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇలా అరెస్టు నమోదు ఆలస్యం చేయడం ద్వారా 24 గంటల గడువును పొడిగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్టు చేసిన ప్రదేశం నుంచి మేజిస్ట్రేట్ కోర్టుకు చేరుకోవడానికి అవసరమైన ప్రయాణ సమయాన్ని మాత్రమే గంటల లెక్కలో మినహాయించవచ్చని తెలిపింది. విచారణ, దర్యాప్తు, సోదాలు లేదా స్వాధీనం కోసం పట్టిన సమయాన్ని మినహాయించడానికి వీల్లేదని పేర్కొంది.












