దేశ రాజధాని ఢిల్లీలోని చావ్రీ బజార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం గురువారం ఉదయం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా, మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
గురువారం ఉదయం సుమారు 9.50 గంటలకు గాలి సితార ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. భవనంలోని మూడో అంతస్తులో స్లాబ్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భవన నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేవని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ అక్రమ నిర్మాణం గురించి ఐదు నెలల క్రితమే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినప్పటికీ, వారు తగిన చర్యలు తీసుకోలేదని పోలీసు వర్గాలు తెలిపినట్లు సమాచారం.












