తమిళనాడు ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు ప్రత్యేక రాయితీతో కూరగాయల ప్యాకెట్లను అందిస్తోంది. విజయం ప్రత్యేక కూరగాయల ప్యాక్ పేరుతో 10 రకాల కూరగాయలను కేవలం రూ.100కే విక్రయించే ఈ పథకం నవంబర్ 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 218 సహకార దుకాణాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. చెన్నైలో నాలుగు మొబైల్ కూరగాయల విక్రయ వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక ప్యాకెట్లో అర కిలో ఉల్లిపాయలు, అర కిలో టమాటాలు, 250 గ్రాముల వంకాయలు, 250 గ్రాముల బంగాళాదుంపలు, 200 గ్రాముల క్యారెట్లు, 200 గ్రాముల బీన్స్, 100 గ్రాముల పచ్చిమిర్చి, 100 గ్రాముల నిమ్మకాయలు, 50 గ్రాముల అల్లం, సుమారు 400-450 గ్రాముల కొబ్బరికాయ ఉంటాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మొత్తం ప్యాకెట్ బరువు సుమారు 2.55 నుంచి 2.60 కిలోల వరకు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ప్యాకెట్ మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశించింది. కూరగాయలను విడివిడిగా కాకుండా పూర్తి ప్యాకెట్ రూపంలోనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.












