ఢిల్లీలో నమోదైన అత్యాచార కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్‌కు తీసుకొచ్చినట్లు సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయగా, యూఏఈ అధికారులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.
అనంతరం చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యాక ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. సీబీఐ ప్రకటన ప్రకారం, సాజిర్ పల్లి మూపన్ అనే వ్యక్తి మరో వ్యక్తితో కలిసి 20 ఏళ్ల యువతికి మత్తు పదార్థం ఇచ్చి, ఆమె స్పృహలో లేని పరిస్థితిని ఆసరాగా చేసుకుని లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
హోటల్లో తప్పుడు వివరాలు
హోటల్లో తప్పుడు గుర్తింపు వివరాలతో గది తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు విదేశాలకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు, అతడిని గుర్తించి భారత్‌కు రప్పించేందుకు సీబీఐ సహకారం కోరారు.












