ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్ ఛాన్స్లర్, రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ జనార్దన్ వాఘ్మారే సోమవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు ధృవీకరించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాఘ్మారేను జనవరి 24న ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్లు సమాచారం. ఆయన మరణంతో విద్యా, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
డాక్టర్ వాఘ్మారే విద్యా రంగానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన మాజీ వైస్ ఛాన్స్‌లర్‌గా, పార్లమెంటేరియన్‌గా తన అనుభవాన్ని, జ్ఞానాన్ని సమాజానికి అందించారు. ఆయన నాయకత్వంలో అనేక విద్యా సంస్థలు అభివృద్ధి చెందాయి.











