ఇండోర్ నుండి పుణె వస్తున్న విమానం (IX-1245) ల్యాండింగ్ సమయంలో ఊహించని విధంగా గాల్లోకి లేచింది. సుమారు సాయంత్రం 5 గంటలకు పుణె విమానాశ్రయ రన్‌వేను సమీపిస్తున్న సమయంలో, విమానం చాలా కఠినంగా ల్యాండ్ అయ్యింది. దీనితో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
విమానం రన్‌వేను తాకిన వెంటనే, పైలట్ తిరిగి విమానాన్ని పూర్తి థ్రాటిల్తో గాల్లోకి లేపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ సంఘటనతో విమానంలోని ప్రయాణికులు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విమానం ఇండోర్ నుండి దాదాపు 4 గంటలకు బయలుదేరింది. షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా విమానం బయలుదేరినట్లు సమాచారం. విమానంలో ప్రయాణిస్తున్న బానర్ నివాసి సందీప్ కొల్టార్కర్ తన కుటుంబంతో పాటు ఈ సంఘటనను అనుభవించారు.











