అనంతపురం
జిల్లా రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. భయాందోళనలకు గురైన విద్యార్థులకు మానసిక ధైర్యం కల్పించేందుకు 20 మంది మానసిక ఆరోగ్య నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాప్తాడు జెడ్పీ హైస్కూల్లో జరిగిన హింసాత్మక ఘటనతో ప్రభావితమైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మానసికంగా అండగా నిలిచేందుకు ఈ బృందం పనిచేయనుంది. పదో తరగతి ఏ సెక్షన్‌కు చెందిన 32 మంది విద్యార్థులతో పాటు, 8, 9, 10 తరగతులకు చెందిన బాలికల ఇళ్లకు కౌన్సెలర్లు వెళ్లి మాట్లాడనున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని తొలగించడం, ఘటన కారణంగా కలిగిన మానసిక ఆందోళన నుంచి బయటపడేలా చేయడం, తల్లిదండ్రులకు భరోసా కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
మంత్రి నారా లోకేష్ స్పందన
ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఏ చిన్నారి కూడా భయంతో జీవించకూడదు.. భయంతో చదువుకు దూరం కాకూడదు. విద్యార్థులు తిరిగి ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు వెళ్లేలా, వారు సురక్షితంగా ఉన్నారనే నమ్మకం కలిగేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. పిల్లల సంక్షేమమే మా ప్రాధాన్యత అని పేర్కొన్నారు.







