తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ కేసు విచారణ ఆంధ్రప్రదేశ్‌లోనే కొనసాగనుంది.
లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి నాణ్యత, సరఫరా వ్యవహారాలపై గతంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో విచారణ రాష్ట్రం వెలుపల జరగాలంటూ పిటిషన్ దాఖలైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అయితే, కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదన్న నిర్ణయంతో సుప్రీంకోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించలేదు.











