గుంటూరు, 7 నవంబర్ 2026
మురసు తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించి, దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
బాపట్ల, గుంటూరు జిల్లాల్లోని జిల్లెల్లమూడి నుంచి రేతూరు వరకు పర్యటించిన సీఎం.. నీట మునిగిన వరి పొలాలను, దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి సాగు పెట్టుబడులు, దిగుబడి అంచనాలు, పంట నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ కారణంగా నష్టం జరగడం బాధాకరమని పేర్కొన్నారు.











