ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బూత్ లెవల్ ఆఫీసర్ విధులు కేటాయించవచ్చని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది.
ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు బూత్ లెవల్ ఆఫీసర్ () విధులు కేటాయించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్నికల సంబంధిత విధుల్లో ఉపాధ్యాయులను నియమించడం చట్టబద్ధమేనని, దీనికి విద్యాహక్కు చట్టం ( ), 2009లోని సెక్షన్ 27 అనుమతిస్తోందని స్పష్టం చేసింది. ఈ తీర్పు ఉత్తరప్రదేశ్‌లోని ఐదుగురు ఉపాధ్యాయులు దాఖలు చేసిన పిటిషన్‌పై వెలువడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అసలు వివాదం ఏమిటి
ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్పూర్ జిల్లాకు చెందిన ఐదుగురు అసిస్టెంట్ టీచర్లు జూనియర్, సీనియర్ బేసిక్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. వారికి అధికారులు విధులు కేటాయించారు. అయితే ఉపాధ్యాయులు ఈ నియామకాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. తమ ఉద్యోగ నిబంధనల్లో విధులు నిర్వహించాలని ఎక్కడా లేదని, ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత విద్యార్థులకు విద్యాబోధన చేయడమేనని, ఎన్నికల విధులు కేటాయించడం వల్ల బోధనకు ఆటంకం కలుగుతుందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-, విద్యాహక్కు చట్టం నిబంధనలకు ఇది విరుద్ధమని వాదించారు. విధుల నుంచి తమను తప్పించాలని కోర్టును కోరారు.











