ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఆరుగురు సజీవ దహనమయ్యారు.
ముజఫర్‌నగర్ జిల్లాలోని జాగాహెడి ప్రాంతం సమీపంలో పానిపట్ఖతీమా జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున సుమారు 4:50 గంటలకు ఈ ఘోరం జరిగింది. కారు అదుపుతప్పి ముందుగా విద్యుత్ స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొని రోడ్డు పక్కకు పడిపోయింది. వెంటనే కారులో మంటలు చెలరేగడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు బయటకు రాలేక మంటల్లోనే సజీవ దహనమయ్యారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రయాణికుల వివరాలు
ప్రాథమిక సమాచారం ప్రకారం, ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న వారు హర్యానాలోని హిసార్ నుంచి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు వెళ్తున్నారు. అయితే, మరికొన్ని స్థానిక నివేదికల ప్రకారం వారు హర్యానాలోని జింద్ జిల్లాకు చెందినవారని తెలుస్తోంది. మృతుల పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.











