యెస్ బ్యాంక్ ఆర్థిక సంక్షోభం, ఏటీ-1 బాండ్ల రద్దు వ్యవహారంలో భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. బ్యాంకు కార్యకలాపాల్లో అవకతవకలు చోటుచేసుకుంటున్న సమయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తగిన విధంగా వ్యవహరించలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పరిపాలనా వైఫల్యాల భారాన్ని పెట్టుబడిదారులపై వేయడం అన్యాయమని స్పష్టం చేసింది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. యెస్ బ్యాంక్కు చెందిన రూ.8,415 కోట్ల విలువైన అదనపు శ్రేణి-1 (ఏటీ-1) బాండ్లను 2020లో రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని కొట్టివేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, ఆర్బీఐ, యెస్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పీళ్లను తిరస్కరించింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆర్బీఐ పర్యవేక్షణపై ప్రశ్నలు
యెస్ బ్యాంక్ సాధారణ ఈక్విటీ టైర్-1 మూలధన నిష్పత్తి 0.6 శాతానికి పడిపోయినప్పటికీ, పరిస్థితిని పర్యవేక్షించడంలో ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోలేదని సుప్రీంకోర్టు పేర్కొంది. బ్యాంకు కార్యకలాపాల్లో గతంలోనే పలు అవకతవకలు గుర్తించారని, సంబంధిత సిబ్బందిపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయని ధర్మాసనం గుర్తుచేసింది.












