అన్నమయ్య జిల్లా మండలం పులగూరవాండ్లపల్లె గ్రామంలో తండ్రిని కట్టెతో కొట్టి హత్య చేసిన కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం మత్తులో జరిగిన కుటుంబ కలహమే ఈ దారుణానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.
పులగూరవాండ్లపల్లెకు చెందిన చక్కర సహదేవ (50) మద్యానికి బానిసై రోజూ ఇంట్లో భార్య, పిల్లలతో గొడవ పడుతుండేవాడు. ఈ నెల 13వ తేదీ రాత్రి కూడా మద్యం సేవించి వచ్చి ఇంట్లో గొడవకు దిగాడు. భార్యను దుర్భాషలాడుతూ, కొట్టేందుకు ప్రయత్నించాడు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ క్రమంలో తండ్రి ప్రవర్తనతో విసిగిపోయిన కుమారుడు చక్కర సంతోష్ (24) కోపంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న కట్టెను తీసుకుని తండ్రి తలపై పలుమార్లు బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన సహదేవ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు.












