దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం శుభవార్త అందించింది. ఐదు రోజుల ముందే జీతాలు, పింఛన్లు జమ చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో లక్షలాది మందికి ఊరట లభించనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు కేంద్రం శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నేపథ్యంలో ఐదు రోజుల ముందే జీతాలు, పింఛన్లు జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పింఛన్లు జమ అవుతాయి. అయితే, బ్యాంక్ యూనియన్లు తలపెట్టిన 5 రోజుల సమ్మె కారణంగా ఉద్యోగులు, పింఛనర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.










