కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 109 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఈ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజల నుంచి 109 ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, నిబంధనల ప్రకారం పరిశీలించి, అర్హత మేరకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులో చర్యలు తీసుకోవడంతో పాటు, పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రజావాణికి వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వై. గిరి, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ, డీఆర్ఓ పాండు, సీఈఓ చందర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి











