వై.ఎస్.ఆర్ కడప, 10 November
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది 24 గంటల్లో బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దీని ప్రభావంతో అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించారు. సముద్రంలో అలల ఉద్ధృతి కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని సూచించారు.












