మధ్యధరా సముద్రంలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. యూరప్‌కు చేరుకోవాలనే ఆశతో ప్రయాణిస్తున్న వలసదారుల పడవ గ్రీస్‌లోని క్రీట్ ద్వీపం సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, 18 మందిని గ్రీస్ కోస్ట్‌గార్డ్ సిబ్బంది సురక్షితంగా రక్షించారు.
సోమవారం తెల్లవారుజామున క్రీట్ ద్వీపానికి సుమారు 15 నాటికల్ మైళ్ల దూరంలో మొరాకో జెండాతో ప్రయాణిస్తున్న కంటైనర్ నౌక ఈ పడవను గుర్తించింది. వెంటనే అధికారులకు సమాచారం అందడంతో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రక్షించిన వారిని తీరానికి తరలించారు. వారిలో కొందరిని ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. రక్షించబడిన వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు.











