బాలీవుడ్ నటి అనీత్ పడ్డా తన 24వ పుట్టినరోజును అద్భుతమైన ఫెయిరీటేల్ థీమ్‌తో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పార్టీకి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
బాలీవుడ్లో సయ్యారా () సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటి అనీత్ పడ్డా తన 24వ పుట్టినరోజును అద్భుతమైన ఫెయిరీటేల్ థీమ్‌తో జరుపుకున్నారు. ఈ వేడుకలో అలంకరణలు, కేకులు, సెలబ్రిటీల సందడి ఒక ఎత్తయితే.. ఆమె ధరించిన పసుపు రంగు దుస్తులు మరో ఎత్తుగా నిలిచాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అనీత్ పుట్టినరోజు వేడుకలను గులాబీ, ఆకుపచ్చ రంగుల అలంకరణలతో అందంగా తీర్చిదిద్దారు. గులాబీ, ఆకుపచ్చ రంగుల బెలూన్లు, అద్భుతమైన కోట ఆకారంలో రూపొందించిన బర్త్‌డే కేకులు, ఫెయిరీటేల్ కథలోని ప్రపంచాన్ని తలపించే అలంకరణలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సందడితో వేడుక మొత్తం ఒక అందమైన అద్భుత కథలోని దృశ్యంలా కనిపించింది.











