Palnadu/Gurazala (డాక్సిన్ టైమ్స్) జూన్ 28
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్' (వీబీ జీ రాం జీ) పథకం జూలై 2న ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభం కానుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో వచ్చిన ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో ఏపీ నుంచే ఆరంభించనున్నారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లెలో జరిగే ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి, ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతారు.
జూలై 2న ఆంధ్రప్రదేశ్ వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అజీవిక మిషన్ గ్రామీణ్' (వీబీ జీ రాం జీ) పథకం ప్రారంభం కానుంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా వచ్చిన ఈ పథకాన్ని జాతీయ స్థాయిలో ఇక్కడే ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కవారిపల్లెలో జూలై 2న ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఈ పథకాన్ని ఏపీలో ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఆయన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన శివరాజ్‌సింగ్ చౌహాన్, ఏపీలో ప్రారంభించేందుకు అంగీకరించారు.












