కడప నగరంలో ప్రధాన కూడళ్లలో విగ్రహాల ఏర్పాటుకు అధికారమే సరిపోతుందని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
కడప స్థానిక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమకు నచ్చిన కూడళ్లలో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. రైతు బజార్ కూడలిలో స్వాతంత్ర్య సమరయోధుడు, కలియుగ దానకర్ణుడు బుడ్డా వెంగల్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తీర్మానించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన హామీ ఇచ్చారని, కానీ ఆయన కుటుంబం అధికారంలో లేకపోవడంతో విగ్రహం ఏర్పాటు కాలేదని తెలిపారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగల్ రెడ్డి వంటి మహనీయుల విగ్రహాల కోసం ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.











