వై.ఎస్.ఆర్ కడప, 19 September
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో శనివారం హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 52,02,495 నగదు, 62 గ్రాముల బంగారం, 351 గ్రాముల వెండి వచ్చినట్లు మఠం నిర్వాకులు తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో శనివారం హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ. 52,02,495 నగదు, 62 గ్రాముల బంగారం, 351 గ్రాముల వెండి వచ్చినట్లు మఠం నిర్వాకులు తెలిపారు. బ్రహ్మంగారిమఠం హుండీల ద్వారా రూ. 47,85,689, పోలేరమ్మ హుండీ ద్వారా రూ. 3,82,897, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ. 33,909 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి, ఎండోమెంట్ ఏసీ శంకర్‌బాలాజీ, విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ గొడ్లవీడు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.












