మండలం గర్గుల్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గ్రామంలో పర్యటించి, బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గర్గుల్ గ్రామంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం గంప గోవర్ధన్ సందడి చేశారు. గ్రామంలోని పలు వినాయక మండపాలను సందర్శించి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ వివరాలను తెలుసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
భక్తులు, గ్రామస్థులు గంప గోవర్ధన్‌కు ఘన స్వాగతం పలికారు. మండపాల వద్ద భజనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడి నెలకొంది. ఈ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని గంప గోవర్ధన్ ప్రారంభించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.











