కామారెడ్డి పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయి. డీజే శబ్దాలు లేకుండా సంప్రదాయ డప్పు వాయిద్యాలు, డోలు విన్యాసాలతో జరిగిన శోభాయాత్ర అందరినీ ఆకట్టుకుంది.
కామారెడ్డి పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, గణేష్ నిమజ్జన మహోత్సవం ప్రశాంత వాతావరణంలో వైభవంగా ముగిశాయని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు. డీజే శబ్దాలు లేకుండా, సంప్రదాయ డప్పు వాయిద్యాలు, డోలు విన్యాసాలతో కులమతాలకు అతీతంగా భక్తిపారవశ్యంతో సాగిన గణేష్ శోభాయాత్ర పండుగ వాతావరణాన్ని తలపించిందని ఆమె కొనియాడారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
పట్టణ ప్రజల సహకారం, వివిధ గణేష్ మండళ్ల నిర్వాహకుల క్రమశిక్షణ వల్లే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనోత్సవం విజయవంతంగా ముగిసిందని ఆమె తెలిపారు. నవరాత్రుల ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












