వై.ఎస్.ఆర్ కడప, 24 September
గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణకు ఈ భారీ చేరికలు నిదర్శనమని శ్రీనివాసరాజు పేర్కొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
రాజంపేట నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. జనసేన రాజంపేట పార్లమెంట్ ఇన్చార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నారపురెడ్డిపల్లికి చెందిన రఘు యాదవ్‌తో పాటు సుమారు 300 కుటుంబాలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు. ముందుగా నారపురెడ్డిపల్లిలో రఘు యాదవ్ ఇంటి నుంచి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో బలిజపల్లి గంగమ్మ తల్లికి టెంకాయలు కొట్టి, యల్లటూరు శ్రీనివాసరాజు పేరున ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాజంపేట రైల్వే స్టేషన్ రోడ్డు నుంచి పాత బస్టాండ్ కూడలి వరకు పట్టణ పురవీధులలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ మన్నూరులోని జనసేన కార్యాలయం యల్లటూరు భవన్‌కు చేరుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసం, యల్లటూరు శ్రీనివాసరాజుపై నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నట్లు రఘు యాదవ్‌తో పాటు నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు తెలిపారు. ఈ సందర్భంగా యల్లటూరు శ్రీనివాసరాజు వారికి జనసేన కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.











