మాదిగ మహిళలు అన్ని రంగాల్లో ఎదుగుతూ, రాజకీయ, సామాజిక పోరాటాల్లో ముందుండాలని మాదిగ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ గుమ్ముట్ల పద్మ పిలుపునిచ్చారు. జిల్లా మాదిగ మహిళా సమైక్య నూతన అధ్యక్షురాలు భానుపురం లావణ్యకు ఘన సన్మానం జరిగింది.
ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ఆశీస్సులతో, మాదిగ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలిగా నియమితులైన భానుపురం లావణ్య నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పెద్ద గీత మాదిగ అధికారికంగా ప్రకటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ నేపథ్యంలో సోమవారం పట్టణంలో మాదిగ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నూతన జిల్లా అధ్యక్షురాలు భానుపురం లావణ్యకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గుమ్ముట్ల పద్మ మాట్లాడుతూ, మాదిగ మహిళల సంక్షేమం, వారి హక్కుల సాధన కోసం సమైక్య నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.












