కడప జిల్లా కోర్టు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రెండు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శిక్షణ పొందిన మధ్యవర్తులకు అవగాహన సమావేశం, న్యాయమూర్తులతో చర్చా సమావేశం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామగోపాల్ సమక్షంలో జరిగాయి.
మొదటి కార్యక్రమంలో శిక్షణ పొందిన మధ్యవర్తులకు న్యాయ సేవా సదన్‌లో అవగాహన సమావేశం నిర్వహించారు. రెండవ కార్యక్రమంలో మధ్యవర్తిత్వానికి కేసులను సూచించే న్యాయమూర్తులతో పరస్పర చర్చా జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన ఛాంబర్లో నిర్వహించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ రెండు కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు జరిగాయి. సుప్రీంకోర్టు శిక్షకురాలు విజయ కమల మధ్యవర్తిత్వ ప్రక్రియ, బాధ్యతలు, కక్షిదారులతో వ్యవహరించే విధానం, వివాదాల పరిష్కారంపై శిక్షణ ఇచ్చారు.












