జిల్లా కేంద్రంలోని పెద్దమ్మ తల్లి దేవాలయంలో దుర్గామాతా శరన్నవరాత్రి ఉత్సవాలను మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమ్మవారి రథం ఊరేగింపును కూడా ఆమె ప్రారంభించారు. ఈ పవిత్ర వేడుకల్లో భాగంగా చైర్ పర్సన్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దమ్మ దేవాలయంలో భక్తిశ్రద్ధలతో దుర్గామాతా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి రథం ఊరేగింపును ప్రారంభించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
దుర్గామాతా కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పట్టణం అన్ని రంగాల్లోనూ మరింత అభివృద్ధి చెందాలని అమ్మవారిని వేడుకున్నట్లు చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తెలిపారు.












