స్థానిక సంస్థల ఎన్నికల కడప జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలతో సమావేశమై, స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు.





