కామారెడ్డి పట్టణం దేవునిపల్లిలోని స్వప్నలోక్ కాలనీలో దుర్గాదేవి నవరాత్రుల్లో భాగంగా గురువారం కుంకుమార్చన పూజలు, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఆలయ పురోహితుడు శ్రీ హర్షశర్మ మాట్లాడుతూ, ప్రతిరోజు భవాని మాత వద్ద ప్రత్యేక పూజలతో పాటు మాలాదారులు, కంకణదారులతో గణపతి పూజ, ప్రత్యేకార్చనలు, నవగ్రహ పూజ, పంచామృత అభిషేకాలు తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు, అలంకరణలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కౌమారీ పూజలు, ప్రత్యేక దీపాలంకరణ, శ్రీ లక్ష్మీ సమేత సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు, గురువారం కుంకుమ పూజలు, మంగళ హారతి, మహా నివేదన, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.పి.ఆర్ స్కూల్ యజమాన్యం కొమిరెడ్డి మారుతి, కార్యవర్గం, మాలాధారులు, కంకణదారులు, కాలనీవాసులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి











