ముప్కాల్ మండలం వెంచిర్యాల గ్రామపంచాయతీ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం గ్రామంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో ఎంపీడీఓ బి.రమేష్, సర్పంచ్ నిమ్మల రాజామణి-శ్రీనివాస్ చేతుల మీదుగా స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు.
గ్రామంలో జరిగే కార్యక్రమాలు, వివాహాలు, పుట్టినరోజులు, ఇతర శుభకార్యాలలో వినియోగించుకోవడానికి ఈ స్టీల్ ప్లేట్లను సమకూర్చినట్లు సర్పంచ్ తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
శనివారం ఉదయం దుర్గాదేవి మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో స్టీల్ ప్లేట్లను అందజేశారు.












