కామారెడ్డి జిల్లా మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న గోదాం నిర్మాణ పనులను ఎంపీడీవో సంతోష్ కుమార్ శనివారం పరిశీలించారు. గ్రామస్తులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామ ప్రజల అభిప్రాయం మేరకే అధికారులు నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. బాయిల్డ్, రా రైస్ మిల్లులతో గ్రామానికి ముప్పు పొంచి ఉందని, ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని కోరారు. గ్రామంలో ఇప్పటికే కాలుష్యంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మళ్ళీ అనుమతి ఇస్తే గందరగోళ పరిస్థితి ఏర్పడి గ్రామాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదు మేరకు ఎంపీడీవో విచారణ చేపట్టారు. రైస్ మిల్లు రద్దుకై గ్రామసభలోనూ గ్రామస్థులు తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.












