అన్నమయ్య జిల్లాలో మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల సన్నద్ధత, భద్రతా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
శుక్రవారం మదనపల్లె కలెక్టరేట్లోని నీతి హాలులో జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎస్పీ పాల్గొని పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గుర్తించిన 45 పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ఓటర్ల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
అత్యవసర పరిస్థితులను క్షణాల్లో అదుపు చేసేందుకు రూట్ల వారీగా 10 ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు బలగాలతో పాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, హోంగార్డులు, మాజీ సైనికులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.











