మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి కడప, జిల్లాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. నామినేషన్ల సమయంలో అల్లర్లకు అవకాశం ఉందనే సమాచారం మేరకు పోలింగ్ నిర్వహణపై ప్రత్యేకంగా కడప, పులివెందులపై దృష్టి సారించినట్లు ఆయన చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ప్రధాన కార్యాలయం నుంచి భారీగా పోలీసు బలగాలను కడప, పులివెందులకు తరలిస్తున్నామని డీఐజీ వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తున్నామని, రౌడీషీటర్లు, గతంలో గొడవలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచామని తెలిపారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
17 మార్గాల మూసివేత, తనిఖీలు











