ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ఎంతో విలువ ఉందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఆదివారం జరిగే మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికలు -2026 లో భాగంగా మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ వ తేదీన (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని వెంట తీసుకుని తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్‌బాక్స్‌కి పొందండి
ఈ ఎన్నికల్లో ఓటర్లకు రెండు బ్యాలెట్ పత్రాలు అందజేస్తారని, గులాబీ రంగు బ్యాలెట్ పత్రం మేయర్ అభ్యర్థికి, తెలుపు రంగు బ్యాలెట్ పత్రం కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఉంటుందని వివరించారు. ఓటు వేసిన అనంతరం రెండు బ్యాలెట్ పత్రాలను ఒకే బ్యాలెట్ పెట్టెలో వేయాలని తెలిపారు.











